2.ఓ అసలు బడ్జెట్ ఎంతంటే..!

సూపర్ స్టార్ రజినికాంత్, శంకర్ కాంబినేషన్ లో రోబో సీక్వల్ గా వస్తున్న సినిమా 2.ఓ. లైకా ప్రొడక్షన్ లో వస్తున్న ఈ సినిమాను రెండేళ్లుగా తీస్తూనే ఉన్నాడు శంకర్. రజినికాంత్ సరసన ఎమీ జాక్సన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ విలన్ గా నటించడం విశేషం. అయితే ఈ సినిమా బడ్జెట్ విషయంలో ఒక్కొక్కరు ఒక్కోలా చెప్పుకుంటున్నారు.

అసలు ఇంతకీ 2.ఓ బడ్జెట్ ఎంత అయ్యింది అంటే దానికి అయ్యింది 400 కోట్లట. కాని వార్తల్లో మాత్రం 500, 550 కోట్లు అంటూ హడావిడి చేస్తున్నారు. ఆ 400 కోట్లు కూడా మొదట చేయించిన వి.ఎఫ్.ఎక్స్ బాగాలేకనే మళ్లీ చేయించడం వల్ల బడ్జెట్ పెరిగిందట. నవంబర్ 3న ట్రైలర్ రిలీజ్ చేస్తున్న ఈ సినిమాపై  ఇప్పటికే భారీ స్థాయిలో అంచనాలున్నాయి. తెలుగు, తమిళ, హింది భాషల్లో ఏకకాలంలో రిలీజ్ అవబోతున్న ఈ 2.ఓ బడ్జెట్ రికవరీ పెద్ద కష్టం కాదని చెప్పొచ్చు.