
శ్రీను వైట్ల డైరక్షన్ లో మాస్ మహరాజ్ రవితేజ హీరోగా వస్తున్న సినిమా అమర్ అక్బర్ ఆంటోనీ. పోస్టర్స్ తో సినిమా మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిన శ్రీను వైట్ల ఈరోజు టీజర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కొద్ది నిమిషాల క్రితం రిలీజైన టీజర్ సినిమా మీద ఆసక్తి పెంచిందనే చెప్పాలి. మనం కష్టాల్లో ఉన్నప్పుడు కాపాడేది మనచుట్టూ ఉన్న బలగం కాదు మనలోని బలం.
దాదాపుగా ఇదే ఈ సినిమా మెయిన్ థీం అన్నది చెప్పొచ్చు. ఇక అమర్ అక్బర్ ఆంటోనీ ఇలా ముగ్గురు వేరు వేరు వ్యక్తులుగా రవితేజ నటించడం పెద్దగా తేడా లేకున్నా సినిమా కథలోని ట్విస్టులు అందరిని ఆశ్చర్యపరుస్తాయని అనిపిస్తుంది. ఇక చాలా రోజుల తర్వాత గోవా బ్యూటీ ఇలియానా ఈ సినిమాలో నటించడం విశేషం. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో వస్తున్న ఈ సినిమా టీజర్ ఇంప్రెసివ్ గా అనిపించింది. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి. నవంబర్ 16న రిలీజ్ అంటూ ఎనౌన్స్ చేసిన దర్శక నిర్మాతలు సినిమా పర్ఫెక్ట్ ప్లానింగ్ తో వస్తుందని తెలుస్తుంది.