విజయ్ 'సర్కార్' 80 దేశాల్లో రిలీజ్

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ మురుగదాస్ డైరక్షన్ లో చేసిన సర్కార్ సినిమా దీపావళి కానుకగా నంవబర్ 6న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. బాహుబలి రికార్డులను బ్రేక్ చేయడమే ముఖ్య ఉద్దేశంతో ఈ సినిమాను తమిళనాడు, కేరళలో భారీగా రిలీజ్ చేస్తున్నారట. రిలీజ్ అయిన మొదటి వారం మొత్తం 24 గంటలు షోలకు పర్మిషన్ తీసుకున్నట్టు తెలుస్తుంది. 

అంతేకాదు వరల్డ్ వైడ్ గా 80 దేశాల్లో ఈ సినిమా రిలీజ్ ప్లాన్ చేశారట. యూఎస్ లో కూడా భారీ లొకేషన్స్ లో రిలీజ్ చేస్తున్నారని తెలుస్తుంది. తెలుగులో కూడా పోటీగా సినిమాలు ఏవి లేవు కాబట్టి ఈసారి విజయ్ సర్కార్ తో తెలుగులో కూడా సత్తా చాటాలని చూస్తున్నాడు. సన్ పిక్చర్స్ అధినేత కళానిధి మారన్ నిర్మించిన ఈ సినిమాలో విజయ్ సరసన కీర్తి సురేష్ నటించింది. సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయగా అకాడమీ అవార్డ్ విన్నర్ ఏ.ఆర్.రహమాన్ మ్యూజిక్ అందించారు.