పాటల రచయిత దొంగగా మారాడు..!

తేజ డైరక్షన్ లో వచ్చిన నువ్వు నేను, జయం లాంటి సూపర్ హిట్ సినిమాలకు పాటలు అందించిన పాట రచయిత కులశేఖర్ పరిస్థితి దారుణంగా తయారయ్యింది. కొన్నాళ్లు అవకాశాలు లేక ఖాళీగా ఉన్న అతని మానసిక స్థితి బాగాలేక చివరకు దొంగగా కూడా మారినట్టు తెలుస్తుంది. ఆల్రెడీ 2013లో కాకినాడలో బాలాత్రిపుర సుందరి ఆలయంలో శఠగోపం దొంగతనం చేశాడని ఆరు నెలలు జైలు శిక్ష అనుభవినచాడు.  అయినా సరే అతను చేతివాటం తగ్గలేదు.   

లేటెస్ట్ హైదరాబాద్ లో ఓ గుడిలో చోరీ చేసిన కేసులో కులశేఖర్ ను అరెస్ట్ చేశారు. అక్కడ పూజారుల బ్యాగులు, సెల్ ఫోన్స్ కొట్టివేయగా అతన్ని అరెస్ట్ చేసిన పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం అతన్ని చంచల్ గూడ జైలుకి పంపించడం జరిగింది. 



పాటల రచయితగా 100కు పైగా పాటలు రాసిన కులశేఖర్ ఇలాంటి పరిస్థితిలో చూడాల్సి వస్తుందని ఎవరు ఊహించి ఉండరు. కుటుంబ సభ్యులు కూడా అతన్ని ఇంట్లో నుండి బయటకు పంపించారని తెలుస్తుంది. ప్రస్తుతం కులశేఖర్ మానసిక పరిస్థితి బాగాలేదని అంటున్నారు. ఇక ఈ విషయంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.