ఎన్టీఆర్ ను వెయిటింగ్ లో పెట్టిన మహేష్

ఎన్.టి.ఆర్ బయోపిక్ గా నందమూరి బాలకృష్ణ లీడ్ రోల్ లో క్రిష్ డైరక్షన్ లో మూవీ వస్తుంది. ఎన్.బి.కే ప్రొడక్షన్స్ లో విష్ణు ఇందూరి, సాయి కొర్రపాటి కూడా ఈ సినిమా నిర్మాణంలో భాగమయ్యారు. రెండు పార్టులుగా రాబోతున్న ఈ సినిమాలో రానా, సుమంత్, కళ్యాణ్ రాం వంటి స్టార్స్ నటిస్తున్నారని తెలిసిందే. ఇక ఇప్పుడు ఈ సినిమాలో సూపర్ స్టార్ మహేష్ కూడా జాయిన్ అవుతున్నాడని లేటెస్ట్ టాక్.

ఎన్.టి.ఆర్ బయోపిక్ లో సూపర్ స్టార్ కృష్ణ ప్రస్థావన ఉంటుందట. కృష్ణ పాత్రలో మహేష్ అయితేనే పర్ఫెక్ట్ అని భావించిన ఎన్.టి.ఆర్ అండ్ టీం మహేష్ ముందు ఈ ప్రస్థావన తెచ్చారట. బాలయ్య బాబే స్వయంగా మహేష్ కు కాల్ చేసి తండ్రి పాత్రలో నటించాలని అడిగారట. అయితే మహేష్ మాత్రం ఇంకా ఏ నిర్ణయం చెప్పలేదట. మహర్షి షూటింగ్ లో అమెరికాలో ఉన్న మహేష్ డెశిషన్ కోసం ఎన్.టి.ఆర్ అండ్ టీం వెయిట్ చేస్తుంది. ఒకవేళ మహేష్ ఓకే అంటే కనుక ఎన్.టి.ఆర్ మూవీకి మరింత క్రేజ్ వచ్చినట్టే.