
మురుగదాస్, విజయ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా సర్కార్. తుపాకి, కత్తి సినిమాల తర్వాత మురుగదాస్, విజయ్ కలిసి చేసిన ఈ సర్కార్ సినిమా నంవంబర్ 6న రిలీజ్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా రిలీజ్ కు బ్రేక్ పడుతుందని అన్నారు. వరుణ్ రాజేంద్రన్ అనే రైటర్ సర్కార్ కథ తను రాసుకున్న సెంగోల్ కథకు కాపీ అంటూ కోర్ట్ లో ఫిర్యాదు చేశాడు.
సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మురుగదాస్ ఈ వివాదం మీద స్పందించాడు. కేవలం పబ్లిసిటీ కోసమే ఈ డ్రామా అంతా అనేశాడు మురుగదాస్. నిర్మాతలు ఈ సినిమా రిలీజ్ కు ఎలాంటి అడ్డంకులు లేకుండా చేస్తున్నారని అన్నారు మురుగదాస్. సో సర్కార్ కాపీ అంతా సదరు రైటర్ పబ్లిసిటీ స్టంట్ అంటూ కొట్టిపారేశాడు మురుగదాస్. మరి నిజంగానే అతని పబ్లిసిటీ స్టంటా లేక వివాదాన్ని డబ్బుతో సరిచేశారా అన్నది తెలియాల్సి ఉంది.