
సూపర్ స్టార్ మహేష్ 25వ సినిమాగా మహర్షి సినిమా తెరకెక్కుతుంది. వంశీ పైడిపల్లి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా తర్వాత మహేష్ సుకుమార్ డైరక్షన్ లో మూవీ కమిట్ అయ్యాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో ఈ సినిమా రాబోతుంది. సుకుమార్ తో సినిమా అయితే ఓకే చేశాడు కాని మహేష్ కథ విషయంలో మాత్రం కాంప్రమైజ్ అవడం లేదట. ఇప్పటికే సుకుమార్ రెండు కథలు చెప్పినా సరే మహేష్ నో అన్నాడట.
సుకుమార్ తన సొంత నిర్మాణంలో సినిమాలు కూడా చేస్తున్నాడు. అందుకే మహేష్ కథ మీద అంత దృష్టి పెట్టడం లేదని తెలుస్తుంది. ప్రస్తుతం తన దగ్గర ఉన్న రెండు లైన్లు మహేష్ కు నచ్చలేదు కాబట్టి కొత్త కథ కోసం వర్క్ మొదలు పెట్టారట. చూస్తుంటే సుకుమార్, మహేష్ సినిమా అనుకున్న టైం కన్నా ఇంకా లేటయ్యేలా కనిపిస్తుంది. సుకుమార్ తర్వాత సందీప్ వంగ డైరక్షన్ లో మూవీ లైన్ లో పెట్టాడు మహేష్.