
టాలీవుడ్ హీరోల్లో శ్రీకాంత్ ది సెపరేట్ స్టైల్.. తెలుగులో 100 సినిమాలను చేసిన శ్రీకాంత్ ప్రస్తుతం కెరియర్ అంత సాటిస్ఫైడ్ గా కొనసాగకున్నా సపోర్టింగ్ రోల్స్ కు సై అంటున్నారని తెలిసిందే. ప్రస్తుతం శ్రీకాంత్ తనయుడిని పూర్తి స్థాయి హీరోగా తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారట. ఇప్పటికే రోషన్ నిర్మలా కాన్వెంట్ సినిమాలో చేశాడు. నాగార్జున కోరిక మేరకే ఆ సినిమా చేసేలా రోషన్ ను ఒప్పించాడు శ్రీకాంత్.
అయితే హీరోగా అన్నివిధాలుగా శిక్షణ తీసుకుంటున్నాడట రోషన్. నటనలో శిక్షణ పూర్తి చేశాడట. డ్యాన్స్, ఫైట్స్ అన్ని పర్ఫెక్ట్ అవనున్నాడట. త్వరలోనే రోషన్ సెకండ్ మూవీ ఉంటుందని చెబుతున్నారు శ్రీకాంత్. 2019లో రోషన్ సెకండ్ మూవీ ఉంటుందని. ఇంకా కథలు వినడం మొదలు పెట్టలేదని అంటున్నాడు శ్రీకాంత్. తనయుడిని స్టార్ చేసే ఆలోచనలో శ్రీకాంత్ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చూస్తున్నాడు. నిర్మలా కాన్వెంట్ లో రోషన్ నటన అందరిని మెప్పించింది.