
అక్కినేని నాగ చైతన్య, చందు మొండేటి కాంబినేషన్ లో వస్తున్న సినిమా సవ్యసాచి. మైత్రి మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో కోలీవుడ్ హీరో మాధవన్ విలన్ గా నటిస్తున్నాడు. చైతు సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా సీనియర్ హీరోయిన్ భూమిక చైతు సిస్టర్ గా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారు. ఇక ఈ సినిమా నుండి వచ్చిన ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది.
ఎడమ చేయి తన ఆదీనంలో లేని ఓ వ్యక్తి ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు. తన ఫ్యామిలీని ఎటాక్ చేసిన విలన్ కు ఎలా బుద్ధి చెప్పాడు అన్నది సినిమా కథ. ఇక ఈ సినిమాలో ఎడమ చేయి తన ఆదీనంలో లేకపోవడం అనే కాన్సెప్ట్ హైలెట్ అవనుంది. అయితే 2017లో ఇదే కాన్సెప్ట్ తో ఓ తమిళ సినిమా వచ్చింది. పీచంకై అనే సినిమా కథ ఇంచుమించు ఇలానే ఉంటుందట. యాక్సిడెంట్ లో చేయి కోల్పోయిన హీరోకి ఏలియన్ హ్యాండ్ సిండ్రోమ్ అనే వ్యాధి వస్తుంది. దాని వల్ల అతని ఎడమ చేయి అతని మాట వినదు. అయితే సవ్యసాచి అలా కాదు పురిటిలో ఇద్దరు వ్యక్తులు ఒకే వ్యక్తిగా జన్మిస్తారని ట్రైలర్ లో చెప్పారు. అందుకే హీరో పేరు విక్రం ఆదిత్య అని పెట్టారు. మరి పీచంకై కథతో పోలిక పెట్టినా సవ్యసాచి డిఫరెంట్ స్టోరీ అంటున్నారు చిత్రయూనిట్.