అరవింద్ చేతిలో ఆ దర్శకులు

దర్శకుల ఎంపికలో ఒక్కో నిర్మాతది ఒక్కో స్టైల్.. టాలీవుడ్ క్రేజీ ప్రొడ్యూసర్స్ లో ఒకరైన అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ బ్యానర్ లో స్టార్ సినిమాలను నిర్మించడమే కాకుండా గీతా ఆర్ట్స్ 2 అంటూ చిన్న బడ్జెట్ మూవీస్ తీస్తున్నారు. శ్రీరస్తు శుభమస్తు, గీతా గోవిందం సూపర్ హిట్లు అందుకున్న అరవింద్ కెరియర్ లో వెనుకపడ్డ దర్శకులకు లిఫ్ట్ ఇవ్వాలని చూస్తున్నాడు.

వారిలో బొమ్మరిల్లు భాస్కర్, శ్రీకాంత్ అడ్డాల ఉన్నారని తెలుస్తుంది. బొమ్మరిల్లు సినిమాతో సత్తా చాటిన భాస్కర్ కొన్నాళ్లుగా అరవింద్ ఛాన్స్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఓ లైన్ ఓకే చేసినా మార్పులు చేర్పులు చేస్తున్నాడట అరవింద్. ఇక అదే దారిలో బ్రహ్మోత్సవం తర్వాత శ్రీకాంత్ అడ్డాల పరిస్థితి తలకిందులైంది. ఈ దర్శకుడు కూడా అల్లు అరవింద్ కు ఓ కథ చెప్పాడట. ఈ ఇద్దరు దర్శకులు అరవింద్ గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురుచూస్తున్నారట. మరి ఇద్దరిలో ఎవరి సినిమా ముందు మొదలవుతుందో కాని దర్శకులు మాత్రం ఈగర్ గా ఎదురుచూస్తున్నారని తెలుస్తుంది.