
టాలీవుడ్ లో ప్రస్తుతం బయోపిక్ సినిమాల ట్రెండ్ కొనసాగుతుంది. మహానటి సినిమాతో అది మరింత ఊపందుకోగా ప్రస్తుతం సెట్స్ మీద ఎన్.టి.ఆర్, వైఎస్సార్ జీవిత కథలు త్వరలో తెర మీద ఆవిష్కృతం కానున్నాయి. ఇక వీరి దారిలోనే అమర గాయకుడు, సంగీత దర్శకుడు ఘంటసాల వెంకటేశ్వర రావు జీవిత కథ ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు. తెలుగు సంగీత ప్రపంచంలో చెరిగిపోని గుర్తుగా ఘంటసాల ప్రేక్షక హృదయాల్లో శాశ్వత స్థానం సంపాదించుకున్నారు.
ఘంటసాల బయోపిక్ గా వస్తున్న ఘంటసాల సినిమా టీజర్ రిలీజ్ చేశారు. సిహెచ్ రామారావు దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను లక్ష్మి నీరజ నిర్మిస్తున్నారు. సాలూరి వాసూరావు ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. టీజర్ లో ఇదవరకు వచ్చిన బయోపిక్ ల ప్రస్థావన తెచ్చి ఘంటసాల బాల్యం.. ఆయన పడిన బాధలు గాయకుడిగా మారకముందు ఘంటసాల జీవితాన్ని చూపిస్తున్నారు. టేకింగ్, ఎడిటింగ్ కాస్త షార్ట్ ఫిల్మ్ లా కనిపిస్తున్నా టీజర్ తో జడ్జ్ చేయలేం కాబట్టి సినిమా ట్రైలర్ వస్తేనే కాని ఈ అటెంప్ట్ ఎలా ఉంటుందో చెప్పొచ్చు. సింగర్ కృష్ణ చైతన్య ఈ సినిమాలో ఘంటసాలగా కనిపిస్తున్నారు. టీజర్ ను ఎస్పి బాల సుబ్రహ్మణ్యం చేతుల మీదుగా రిలీజ్ చేయడం విశేషం.