
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ప్రతి సినిమా రిలీజ్ కు ఏదో ఒక అడ్డంకి వస్తూ ఉంటుంది. ప్రస్తుతం విజయ్ క్రేజీ డైరక్టర్ మురుగదాస్ తో కలిసి సర్కార్ సినిమా చేశాడు. దీపావళి కానుకగా నంవబర్ 6న ఈ సినిమా రిలీజ్ ఫిక్స్ చేశారు. అయితే ఈ సినిమా కథ తాను రాసుకున్న కథకు కాపీ అంటూ ఓ రైటర్ హైకోర్ట్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. తమిళ రచయిత అయిన వరుణ్ రాజేంద్రన్ సర్కార్ సినిమా తాను రాసిన సెంగోల్ కథనే మార్చి సర్కార్ గా తీశారని ఫిర్యాదులో పేర్కొన్నాడు.
కథను కాపీ కొట్టినందుకు మురుగదాస్, కళానిధి మారన్ తనకు 30 లక్షలు చెల్లించాలంటూ తన పిటీషన్ లో రాశాడు. 2007లోనే వరుణ్ రాజేంద్రన్ సెంగోల్ కథను సౌత్ ఇండియన్ ఫిల్మ్ అసోషియేషన్ లో రిజిస్టర్ చేయించాడట. ఈ కథను కాపీ కొట్టి మురుగదాస్ సర్కార్ గా తీశాడని అతను పేర్కొన్నాడు. కోర్ట్ విచారణ తేలే వరకు సర్కార్ రిలీజ్ కు బ్రేక్ పడినట్టే. మరి ఆ రైటర్ తో చిత్రయూనిట్ చర్చలు జరిపి రిలీజ్ కు ఎలాంటి అడ్డంకులు లేకుండా చేస్తారా లేదా అన్నది వేచి చూడాలి.