ఇక్కడ అర్జున్ రెడ్డి.. అక్కడ కబీర్ సింగ్

లాస్ట్ ఇయర్ వచ్చిన సూపర్ హిట్ మూవీస్ లో అర్జున్ రెడ్డి ఒకటి. 4 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఆ సినిమా 40 కోట్ల వసూళ్లను రాబట్టి సంచలన విజయం అందుకుంది. సందీప్ వంగ డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమాతో విజయ్ దేవరకొండ స్టార్ గా ఎదిగాడు. ఇక ఈ సినిమా తెలుగులో సూపర్ హిట్ అవడంతో తమిళ, హింది భాషల్లో రీమేక్ చేస్తున్నారు. తమిళ రీమేక్ సినిమాకు వర్మ టైటిల్ ఫిక్స్ చేశారు.

కోలీవుడ్ స్టార్ హీరో విక్రం తనయుడు ధ్రువ్ ఈ సినిమాలో హీరోగా చేస్తున్నాడు. అర్జున్ రెడ్డి హింది రీమేక్ భారీ స్టార్ కాస్ట్ తో వస్తుంది. షాహిద్ కపూర్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో కియరా అద్వాని హీరోయిన్ గా చేస్తుంది. హింది సినిమాకు కబీర్ సింగ్ అనే టైటిల్ ఫిక్స్ చేశారట. హింది సినిమాను సందీప్ వంగ డైరెక్ట్ చేస్తుండటం విశేషం. ఈమధ్యనే షూటింగ్ మొదలైన ఈ సినిమా కోసం షాహిద్ హెయిర్ స్టైల్, గడ్డం పెంచుకున్నాడని తెలుస్తుంది.