
గురు తర్వాత వెంకటేష్ తన సినిమాల వేగం తగ్గించాడని తెలుస్తున్నా ఒకేసారి రెండు క్రేజీ మల్టీస్టారర్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇప్పటికే వరుణ్ తేజ్ తో చేస్తున్న ఎఫ్-2 ముగింపు దశకు చేరుకోగా నవంబర్ సెకండ్ వీక్ లో బాబి డైరక్షన్ లో మూవీ సెట్స్ మీదకు తీసుకెళ్లబోతున్నారని తెలుస్తుంది. ఈ సినిమాలో వెంకటేష్ తో పాటుగా అక్కినేని నాగ చైతన్య స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు.
వెంకీ మామా టైటిల్ ప్రచారంలో ఉన్న ఈ సినిమాలో వెంకీ, చైతు మామా అల్లుళ్లుగా నటిస్తున్నారట. అంటే రియల్ లైఫ్ క్యారక్టర్స్ తోనే రీల్ లైఫ్ లో కనిపిస్తారన్నమాట. ఈ సినిమాలో చైతుకి జోడీగా రకుల్ ప్రీత్ సింగ్, వెంకటేష్ సరసన హ్యూమా ఖురేషిని సెలెక్ట్ చేశారు. జై లవ కుశ తర్వాత బాబి చేస్తున్న ఈ సినిమా స్క్రిప్ట్ బాగా వచ్చిందట. మరి వెంకీ మామతో కలిసి అల్లుడు చైతు చేసే సందడి ఎలా ఉండబోతుందో చూడాలి.