
బాలీవుడ్ కు ధీటుగా కోలీవుడ్, శాండల్ వుడ్ లో మీటూ ఉద్యమం కొనసాగుతుంది. హీరోయిన్స్ ఈ ఉద్యమం ద్వారా తమ కెరియర్ లో జరిగిన లైంగిక వేధింపులను బట్టబయలు చేస్తున్నారు. ఇక లేటెస్ట్ గా కోలీవుడ్ హీరో అర్జున్ మీద శృతి హరిహరణ్ మీద ఆరోపణలు చేసింది. సినిమా షూటింగ్ లో తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడని అన్నది.
లేటెస్ట్ గా ఖుష్బు అర్జున్ అలాంటోడు కాదని చాలా సందర్భాల్లో తనని సేవ్ చేశాడని అన్నది. ప్రస్తుతం అర్జున్ నటిస్తున్న ఇరువర్ ఒప్పందం సినిమాలో నటిస్తున్న సోనీ చరిస్టా కూడా అర్జున్ కు సపోర్ట్ గా నిలిచింది. అర్జున్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడం బాధాకరమని.. ఆయన అలాంటివ్యక్తి కాదని నిజంగానే ఆన జెంటిల్మెన్ అని కితాబిచ్చారు. స్త్రీలపై ఆయనకు అపారమైన గౌరవం ఉందని.. ఆయన మీద ఆరోపణలు చూస్తుంటే మీటూ ఉద్యమం తప్పుదోవ పట్టిస్తున్నారని సోనీ పేర్కొన్నారు.