చిరంజీవి సిగ్నల్ కోసం వెయిటింగ్

రంగస్థలం హిట్ తో కెరియర్ లో కొత్త జోష్ నింపుకున్న మెగా పవర్ స్టార్ రాం చరణ్ ప్రస్తుతం బోయపాటి శ్రీను డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో కియరా అద్వాని హీరోయిన్ గా నటిస్తుంది. 2019 సంక్రాంతి బరిలో సినిమా దిగుతుండగా ఇంకా ఈ సినిమా టైటిల్ పై ఓ క్లారిటీ రాలేదు. 

అప్పట్లో ఈ సినిమాకు స్టేట్ రౌడీ.. రౌడీ తమ్ముడు లాంటి టైటిల్స్ పెడుతున్నారని ప్రచారం జరుగగా.. లేటెస్ట్ గా వినయ విధేయ రామా అన్న టైటిల్ ను పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది. దసరాకి ఈ టైటిల్ ఎనౌన్స్ చేస్తారని భావించగా మెగాస్టార్ చిరంజీవి నుండి ఈ టైటిల్ కు గ్రీన్ సిగ్నల్ అందలేదని తెలుస్తుంది. 

యాక్షన్ సినిమాకు ఇలాంటి సాఫ్ట్ టైటిల్ ఎంతవరకు వర్క్ అవుట్ అవుతుంది అన్న సందిగ్ధంలో ఉన్నారట. బోయపాటి శ్రీను, చరణ్ మాత్రం వినయ విధేయ రామాకి ఫిక్స్ అవగా చిరుని ఒప్పించే ప్రయత్నమే చేస్తున్నారట. మరి చిరు ఓకే అంటాడా లేక వేరే టైటిల్ పెడతారా అన్నది చూడాలి.