విలన్ గా ఎన్టీఆర్.. ఫ్యాన్స్ ఒప్పుకుంటారా..!

తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి చాటి చెప్పిన దిగ్గజ దర్శకుడు బాహుబలి తర్వాత చరణ్, ఎన్.టి.ఆర్ మల్టీస్టారర్ మూవీ ప్లాన్ చేశాడు. రాజమౌళి ఒక స్టార్ హీరోతో చేస్తే ఆ సినిమా రేంజ్ వేరేలా ఉంటుంది అలాంటిది ఇద్దరు క్రేజీ స్టార్స్ తో రాజమౌళి సినిమా అంటే ఇక అభిమానుల ఊహలకు ఆకాశమే హద్దని చెప్పాలి. మెగా నందమూరి మల్టీస్టారర్ సినిమాకు నవంబర్ 18న ముహుర్తం ఫిక్స్ చేశారు.

ఫస్ట్ ఎన్.టి.ఆర్ ఆ తర్వాత చరణ్ ఈ సినిమా షూటింగ్ లో పాల్గొంటారని తెలుస్తుంది. ఇక ఈ సినిమా గురించి రోజుకో న్యూస్ వైరల్ అవుతుంది. లేటెస్ట్ గా ఈ సినిమాలో చరణ్ హీరోగా.. ఎన్.టి.ఆర్ విలన్ గా కనిపిస్తాడని అంటున్నారు. అదేంటి ఎన్.టి.ఆర్ లాంటి మాస్ హీరోని విలన్ గా ఎలా చేస్తారు. అయినా దీనికి ఫ్యాన్స్ ఒప్పుకుంటారా అన్న సందేహం రావొచ్చు. రాజమౌళి అలా చేస్తున్నాడు అంటే దానికి తగ్గ ప్లాన్ స్క్రిప్ట్ రాసుకుని ఉంటాడని చెప్పొచ్చు. మరి నిజంగానే ఎన్.టి.ఆర్ ప్రతికథానాయకుడిగా కనిపిస్తాడా లేదా అన్నది మరికొద్దిరోజుల్లో తెలుస్తుంది.