
బాహుబలి తర్వాత రాజమౌళి చేయబోతున్న ట్రిపుల్ ఆర్ ప్రాజెక్ట్ పై ఆడియెన్స్ లో భారీ అంచనాలున్నాయి. ఎన్.టి.ఆర్, చరణ్ కలిసి చేస్తున్న ఈ మెగా మల్టీస్టారర్ సినిమాను డివివి దానయ్య నిర్మిస్తున్నారు. 300 కోట్ల భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమా డిసెంబర్ లో సెట్స్ మీదకు వెళ్లనుంది. ప్రస్తుతం జక్కన్న వర్క్ షాప్ మొదలు పెట్టిన ఈ సినిమాలో చరణ్, ఎన్.టి.ఆర్ సర్ ప్రైజ్ లుక్ తో కనిపిస్తారట.
ఇక ఈ సినిమాకి చరణ్, ఎన్.టి.ఆర్ రెమ్యునరేషన్ పై ఓ న్యూస్ బయటకు వచ్చింది. మాములుగా సినిమాకు 15 నుండి 20 కోట్లు తీసుకునే రేంజ్ ఉన్న చరణ్, ఎన్.టి.ఆర్ లు ఈ సినిమాకు రెమ్యునరేషన్ రూపం లో కాకుండా షేర్స్ అడుగుతున్నారట. రాజమౌళి సినిమా అంటే మూడు నాలుగు నెలల్లో పూర్తయ్యే ప్రాజెక్ట్ కాదు. కచ్చితంగా రెండేళ్లు రాసిచ్చేయాలి. అందుకే రెండేళ్లు మూడు సినిమాలు రెమ్యునరేషన్ కవర్ అయ్యేలా ఇద్దరు హీరోలు కలిపి 100 కోట్ల షేర్ వచ్చేలా ప్లాన్ చేస్తున్నారట. ఇది కేవలం ప్రాఫిట్ లో వారు తీసుకునే షేర్ అని తెలుస్తుంది. అంటే సినిమాకు 20 తీసుకునే చరణ్, ఎన్.టి.ఆర్ 50 కోట్లు తీసుకుంటారన్నమాట.