ఆ సినిమా వద్దని అందరు చెప్పారు..!

అక్కినేని నాగ చైతన్య చందు మొండేటి కాంబినేషన్ లో వస్తున్న సినిమా సవ్యసాచి. ఈ సినిమా ట్రైలర్ ఈరోజు రిలీజ్ చేశారు. ట్రైలర్ రిలీజ్ కార్యక్రమంకు సుకుమార్ గెస్ట్ గా వచ్చారు. నాగ చైతన్య కెరియర్ లో 100% లవ్ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఆ సినిమాని డైరెక్ట్ చేసింది సుకుమారే అన్న విషయం తెలిసిందే. ఇక కార్యక్రమంలో భాగంగా సుకుమార్ సినిమా సినిమాకు తన టెంప్లేట్ మార్చుకుంటూ వెళ్తున్నాడని అన్నారు. 

ఇక దర్శకుడు చందుతో ఆల్రెడీ ప్రేమం సినిమా చేశానని చెప్పిన చైతు ఆ సినిమా టైంలో చాలామంది ఆ సినిమా రీమేక్ చేయవద్దని చెప్పారని కాని తాను చెప్పడం వల్ల చందు రీమేక్ కు ఒప్పుకున్నాడని అన్నారు నాగ చైతన్య. ఆ సినిమా టైంలోనే సవ్యసాచి కథ చెప్పాడని.. అయితే అప్పుడు కాదన్న సినిమా మధ్యలో ఓ సారి లైన్ చెప్పగానే నచ్చిందని వెంటనే సినిమా చేసేద్దాం అని చెప్పాడట చైతు.

ఈ సినిమా తాము ఇద్దరం సినిమాను అనుకోగా మాధవన్, భూమిక నటించడం. కీరవాణి మ్యూజిక్ అందించడం.. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమా నిర్మించడం ఇలా అన్ని అద్భుతాలతో సినిమా స్థాయి పెరిగిందని అన్నారు నాగ చైతన్య. నవంబర్ 2న సినిమా రిలీజ్ కన్ ఫాం చేసిన సవ్యసాచి సినిమాపై నాగ చైతన్య ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నట్టు తెలుస్తుంది.