సాహో రిలీజ్ ఎప్పుడు..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి తర్వాత చేస్తున్న సినిమా సాహో. సుజిత్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాను యువి క్రియేషన్స్ లో నిర్మించబడుతుంది. నిన్న రిలీజైన మేకింగ్ వీడియోతో సినిమాపై భారీ అంచనాలు పెంచగా ఈ సినిమా ప్రభాస్ కెరియర్ లో మరో బాహుబలి అవడం ఖాయమని అంటున్నారు. శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా మేకింగ్ వీడియో యాక్షన్ పార్ట్ ఔరా అనిపించేలా చేశాయి.

ఇక ఈ సినిమా రిలీజ్ విషయంలో పెద్ద కన్ ఫ్యూజన్ ఏర్పడింది. తెలుగు, తమిళ, హింది భాషల్లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్న ఈ మూవీ అన్ని భాషల్లో ఖాళీ టైం చూసుకుని వదలాల్సి ఉంది. అసలైతే 2019 సమ్మర్ రిలీజ్ ప్లాన్ చేసిన ఈ సినిమా జూన్ తర్వాతనే రిలీజ్ చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఏప్రిల్, మే లలో మహర్షి, సైరా సినిమాలు వస్తున్నాయి. ఇక బాలీవుడ్ లో కూడా పోటీ ఉంది. అందుకే జూన్ లో అయితే సాహోకి ఎదురు ఉండదని అలా ఫిక్స్ చేశారట. మరి సాహో రిలీజ్ పై ఈ కన్ ఫ్యూజన్ కు ఎప్పుడు తెర పడుతుందో చూడాలి.