
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రం కాంబినేషన్ లో వచ్చిన అజ్ఞాతవాసి సినిమా 2018 సంక్రాంతి బరిలో వచ్చి డిజాస్టర్ గా మిగిలింది. సినిమా ఆశించినంత లేదని ఓ పక్క పవర్ స్టార్ ఫ్యాన్స్ దిగులు పడగా హాలీవుడ్ సినిమాకు కాపీ వివాదం పెద్ద తలనొప్పే తెచ్చిపెట్టింది. ఇక ఆ సినిమా తర్వాత త్రివిక్రం ఎన్.టి.ఆర్ తో కలిసి తీసిన అరవింద సమేత సినిమా ఈమధ్యనే వచ్చి సూపర్ హిట్ అయ్యింది.
అయితే అజ్ఞాతవాసి సినిమా తెలుగులో ఫ్లాప్ అవగా హిందిలో మాత్రం సూపర్ హిట్ అయ్యింది. అదేంటి అంటే తెలుగు సినిమాలు హిందిలో డబ్ అయ్యి రిలీజ్ అవుతాయి. థియేటర్ లో కన్నా వాటిని ఆన్ లైన్ లో చూసే వాళ్ల సంఖ్య ఎక్కువ. అల్లు అర్జున్ సరైనోడు యూట్యూబ్ లో రికార్డ్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. అదే క్రమంలో పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి సినిమా కూడా హింది డబ్బింగ్ వర్షన్ యూట్యూబ్ లో రికార్డులు సృష్టిస్తుంది. ఎవడు 3 టైటిల్ తో రిలీజైన ఈ సినిమా 48 గంటల్లో 18 మిలియన్ వ్యూస్ వచ్చాయి. 3వ రోజుకు 22 మిలియన్ వ్యూస్ సాధించాయట. చూస్తుంటే అతి త్వరలోనే 100 మిలియన్ వ్యూస్ సాధించేలా ఉంది హింది అజ్ఞాతవాసి.