సాహో షేడ్స్ చాప్టర్ 1 అదిరిపోయింది..!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా సుజిత్ డైరక్షన్ లో వస్తున్న సినిమా సాహో. ఈ సినిమాకు సంబందించిన ఓ మేకింగ్ వీడియోని రిలీజ్ చేశారు. ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా షేడ్స్ ఆఫ్ సాహో నుండి చాప్టర్ 1 రిలీజ్ చేశారు దర్శక నిర్మాతలు. షేడ్స్ ఆఫ్ సాహో సినిమా ఎంత భారీగా ఉండబోతుందో ఈ మేకింగ్ వీడియో చూస్తే అర్ధమవుతుంది. అబుదాబి లో షూట్ చేసిన యాక్షన్ పార్ట్ కు సంబందించి ఈ వీడియోలో ఉంది. 

బాహుబలి తర్వాత ప్రభాస్ చేస్తున్న సాహో ఈ మేకింగ్ వీడియోతో సినిమా రేంజ్ ఏంటన్నది చూపించారు. శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు శంకర్ ఎహసన్ లాయ్ మ్యూజిక్ అందిస్తున్నారు. హాలీవుడ్ సినిమాలకు ధీటుగా ఈ మూవీ ఉండబోతుంది అని ఈ మేకింగ్ వీడియో చూస్తే అర్ధమవుతుంది. 2019 సమ్మర్ రిలీజ్ ప్లాన్ చేస్తున్న సాహో సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. చివర్లో ప్రభాస్ స్టైలిష్ లుక్ మాత్రం అదిరిపోయిందని చెప్పొచ్చు.