రీమేక్ పై కన్నేసిన బన్ని

అరవింద సమేత తర్వాత త్రివిక్రం చేసే సినిమా ఏదై ఉంటుందా అన్న కన్ ఫ్యూజన్ కు తెర పడినట్టే. నా పేరు సూర్య నుండి ఎన్ని కథలు వింటున్నా సినిమా ఓకే చేయని బన్ని త్రివిక్రం డైరక్షన్ లోనే తన తదుపరి సినిమా చేయాలని ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది. ఇప్పటికే కథా చర్చలు ముగిశాయని అంటున్నారు. అయితే ఈ సినిమా ఓ బాలీవుడ్ సినిమాకు స్పూర్తిగా తెరకెక్కిస్తున్నారట.

త్రివిక్రం కథలు మాములుగా ఉన్నా కథనం.. మాటలు మనసులను తాకుతాయి. అయితే ఈమధ్య త్రివిక్రం కథల విషయంలో కాపీ వివాదాన్ని ఎదుర్కుంటున్నాడు. అందుకే ఈసారి ఆ ఛాన్స్ ఇవ్వకుండా హిందిలో సూపర్ హిట్ అయిన సోను కె టిటు కి స్వీటీ సినిమా కథను బేస్ చేసుకుని త్రివిక్రం తన మార్క్ స్క్రీన్ ప్లేతో తెరకెక్కించాలని చూస్తున్నాడట. ఇదే నిజమైతే అల్లు అర్జున్ రీమేక్ చేసే మొదటి సినిమా ఇదే అవుతుంది. ఈ సినిమాకు సంబందించిన మిగతా విషయాలు త్వరలో తెలుస్తాయి.