
యువ హీరోల్లో స్వామిరారా సినిమా నుండి డిఫరెంట్ సబ్జెక్టులతో కెరియర్ కొనసాగిస్తున్న నిఖిల్ ప్రస్తుతం తమిళ సూపర్ హిట్ మూవీ కథితణ్ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నాడు. ఆ సినిమాకు తెలుగు టైటిల్ ముద్ర అని పెట్టారని తెలుస్తుంది. ఇక ఈ సినిమాతో పాటుగా మరో సినిమా లైన్ లో పెట్టాడు నిఖిల్. దసరా కానుకగా సినిమా టైటిల్ తో పాటుగా కాన్సెప్ట్ పోస్టర్ వదిలారు.
శ్వాస అంటూ నిఖిల్ కొత్త ప్రయత్నం చేస్తున్నాడు. నిఖిల్ సరసన ఈ సినిమాలో నివేదా థామస్ హీరోయిన్ గా నటిస్తుంది. కిషన్ కాత్య డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను తేజ్, హరినికేష్ కలిసి నిర్మిస్తున్నారు. పోస్టర్ చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించగా సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి. కిరాక్ పార్టీ తెలుగు రీమేక్ లో నటించిన నిఖిల్ ఆ సినిమాతో నిరాశ పరచాడు. రాబోతున్న ముద్ర, శ్వాస సినిమాలతో అలరిస్తాడేమో చూడాలి.