అరవింద సమేతపై చరణ్ కామెంట్..!

ఎన్.టి.ఆర్ హీరోగా త్రివిక్రం డైరక్షన్ లో వచ్చిన సినిమా అరవింద సమేత. ఈ సినిమా మంచి టాక్ తో ఓ రేంజ్ కలక్షన్స్ తో దూసుకెళ్తుంది. ఇప్పటికే సినిమా చూసిన సెలబ్రిటీస్ ఎన్.టి.ఆర్ నటన, త్రివిక్రం డైరక్షన్ గురించి ప్రశంసిస్తున్నారు. వారి లిస్ట్ లో ఇప్పుడు చరణ్ కూడా చేరాడు. అరవింద సమేత గురించి రాం చరణ్ తన ఫేస్ బుక్ లో మెసేజ్ పెట్టాడు.   

అరవింద సమేత సినిమాలో ఎన్.టి.ఆర్ తన కెరియర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడని. బోల్డ్ స్టోరీ, సూపర్ డైరక్షన్, మంచి డైలాగ్స్ తో త్రివిక్రం అదరగొట్టారని. జగపతి బాబు నటన, తమన్ మ్యూజిక్ అలరించాయి. పూజా నటన ఎంజాయ్ చేశాను. అరవింద సమేత సినిమా యూనిట్ కు తన కంగ్రాట్స్ అంటూ మెసేజ్ పెట్టాడు రాం చరణ్.