
బిగ్ బాస్ 2 విన్నర్ గా కౌశల్ కొత్త క్రేజ్ తెచ్చుకోగా ఈమధ్య మనోడు వరుస పెట్టి ఇంటర్వ్యూస్ ఇచ్చేస్తున్నాడు. అయితే ప్రతి ఇంటర్వ్యూ లో ఇంకా ఇతర కంటెస్టంట్స్ గురించి మాటలు అంటూనే ఉన్నాడు. గేమ్ అయ్యింది టైటిల్ చేతికి వచ్చింది అయినా సరే కౌశల్ తను ఇంకా గేమ్ ఆడుతున్నట్టుగా అనిపిస్తుంది. టైటిల్ గెలిచాక తనకి ఎవరు విష్ చేయలేదని.. ఫోన్ కూడా చేయలేదని అన్నాడు కౌశల్.
ఇదే విషయంపై బిగ్ బాస్ 2 రన్నరప్ గీతా మాధురి స్పందించింది. కౌశల్ కు తాను స్టేజ్ మీదే కంగ్రాట్స్ చెప్పానని.. ఆ తర్వాత కూడా ఒకసారి కాల్ చేస్తే తనే అటెండ్ చేయలేదని అన్నది. అంతేకాదు వాట్స్ అప్ వాయిస్ మెసేజ్ పెడితే అతని భార్య రెస్పాన్స్ ఇచ్చిందని చెప్పింది గీతా. రీసెంట్ గా భాను శ్రీ పుట్టిన రోజు వేడుకలకు కూడా కౌశల్ ను ఇన్వైట్ చేసేందుకు కాల్ చేయగా అతను కాల్ లిఫ్ట్ చేయలేదని అన్నది గీతా. ఇక హౌజ్ లో జరిగిన విషయాల గురించి కౌశల్ మళ్లీ మాట్లాడటం పట్ల గీతా మాధురి స్పందించదలచుకోలేదు.