
విజయ్ సేతుపతి, త్రిషా లీడ్ పెయిర్ గా తమిళ దర్శకుడు ప్రేమ్ కుమార్ డైరక్షన్ లో వచ్చిన సినిమా 96. అక్టోబర్ 4న రిలీజైన ఈ సినిమా తమిళంలో సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. 22 ఏళ్ల తర్వాత కలుసుకున్న ప్రేమికుల కథే 96 సినిమా కథ. ఈ సినిమా ఫస్ట్ కాపీ చూశాడో ఏమో కాని రిలీజ్ అవడానికి ముందే దిల్ రాజు ఈ సినిమా రీమేక్ రైట్స్ కొనేశాడు. నాని, సమంతలు కలిసి ఈ సినిమా తెలుగులో చేస్తారని అన్నారు.
అయితే దిల్ రాజు మాత్రం నాని, అల్లు అర్జున్ లకు ఈ సినిమా చూపించాడట. తెలుగులో హీరోయిన్ గా త్రిషనే తీసుకోవాలని చూస్తున్నారు. అయితే హీరో మధ్య వయసు పాత్రలో కనిపించాలి కాబట్టి నాని అందుకు సరిపోతాడా అంటూ డౌట్ పడుతున్నారు. నాని కాకుంటే శర్వానంద్ తో అయినా ఈ మూవీ చేయాలని చూస్తున్నాడట దిల్ రాజు. మరి నాని, శర్వానంద్ ఈ ఇద్దరిలో ఎవరు 96 రీమేక్ చేస్తారో చూడాలి.