
కోలీవుడ్ లో ఈ వారం రిలీజైన సినిమాల్లో 96 సినిమా సూపర్ హిట్ కొట్టింది. ప్రేమ్ కుమార్ డైరక్షన్ లో విజయ్ సేతుపతి, త్రిష కలిసి నటించిన ఈ సినిమా ఆడియెన్స్ ను హర్ట్ టచ్ చేసిందని తెలుస్తుంది. సినిమాకు రివ్యూయర్స్ మాత్రమే కాదు ప్రేక్షకులు అద్భుతమైన రేటింగ్ ఇచ్చారు. 22 ఏళ్ల తర్వాత కలుసుకున్న ప్రేమికుల కథగా 96 సినిమా ప్రేక్షకుల మనసుని కదిలించిందట.
అయితే ఈ సినిమా రిలీజ్ కు ముందే దిల్ రాజు తెలుగు రీమేక్ కోసం రైట్స్ కొనేశారు. నాని, సమంతలతో ఈ సినిమాను రీమేక్ చేస్తున్నారని కూడా వార్తలొచ్చాయి. 96 అక్కడ సూపర్ హిట్ కొట్టింది కాబట్టి ఇక్కడ కూడా దిల్ రాజు రీమేక్ చేసేందుకు సై అంటున్నారు. మరి తమిళ ఆడియెన్స్ ను మెప్పించిన ఈ ప్రేమకథ తెలుగు ప్రేక్షకులను అలరిస్తుందో లేదో చూడాలి.