కాజల్ కు భారీ డిమాండ్

దశాబ్ధ కాలంగా సౌత్ సిని ప్రియులను అలరిస్తున్న కాజల్ ఖైది నంబర్ 150 ముందు కెరియర్ ముగిసినట్టే అనిపించగా కొత్త ఆఫర్స్ ఆమెను మరింత ఉత్సాహపరిచాయి. చిరు సినిమా తర్వాత రానా నేనే రాజు నేనే మంత్రి కూడా కాజల్ కు బ్రేక్ ఇచ్చింది. మళ్లీ వరుసగా స్టార్స్ సినిమాలు చేస్తున్న కాజల్ ఈ గ్యాప్ లో యువ హీరోల సరసన నటించేందుకు సై అంటుంది. ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ సరసన రొమాన్స్ చేస్తున్న కాజల్ ఆ సినిమాకు రెమ్యునరేషన్ గా 1.75 కోట్లు డిమాండ్ చేసిందట.

తేజ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో కాజల్ రెమ్యునరేషన్ కు అందరు షాక్ అవుతున్నారు. కోటిన్నర ఇస్తే ఎవరితో అయినా చేస్తా అని ఇదవరకు ఓ ఇంటర్వ్యూలో చెప్పిన కాజల్ క్రేజ్ ను బాగానే క్యాష్ చేసుకుంటుందని చెప్పొచ్చు. ఇక ఇదే కాకుండా మరో కొత్త దర్శకుడు సినిమాలో కూడా బెల్లంకొండ కాజల్ నే హీరోయిన్ గా ఎంచుకున్నాడట. చూస్తుంటే బెల్లంకొండతో కాజల్ కు బాగా కుదిరినట్టు గుసగుసలాడుతున్నారు.