
బాహుబలి తర్వాత రాజమౌళి చేయబోయే మల్టీస్టారర్ మూవీ ట్రిపుల్ ఆర్ సినిమాపై ఈమధ్య రకరకాల వార్తలు వచ్చాయి. అరవింద సమేత షూటింగ్ మధ్యలోనే హరికృష్ణ మరణించడం సినిమా షూటింగ్ పూర్తి చేయాలనే ఉద్దేశంతో రెస్ట్ లెస్ గా పని చేయడం జరిగింది. అరవింద సమేత రిలీజ్ తర్వాత దాదాపుగా 3 నుండి 6 నెలల వరకు ఎన్.టి.ఆర్ సినిమాలు చేయడని అన్నారు. అయితే ఈ విషయంపై క్లారిటీ ఇచ్చాడు ఎన్.టి.ఆర్.
అరవింద సమేత ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూస్ లో సినిమా రిలీజ్ తర్వాత ఒక నెల రోజులు ఫ్యామిలీతో విధేశాలకు వెళ్తానని.. ఆ తర్వాత వచ్చి ట్రిపుల్ ఆర్ షూటింగ్ లో జాయిన్ అవుతానని అన్నాడు ఎన్.టి.ఆర్. డిసెంబర్ లో ఆ సినిమా మొదలవుతుందని చరణ్ కంటే తానే ట్రిపుల్ ఆర్ షూట్ లో జాయిన్ అవుతానని అన్నాడు ఎన్.టి.ఆర్.
నవంబర్ అనుకున్నది కాస్త డిసెంబర్ కు మారింది అంతే తప్ప మిగతా షెడ్యూల్ అంతా యధావిదిగా సాగుతుందని తెలుస్తుంది. ఇక అరవింద సమేతలో డ్యుయల్ రోల్ గురించి అడుగగా అది సినిమాలో చూడండని అన్నాడు ఎన్.టి.ఆర్.