మహర్షి కోసం విలేజ్ సెట్..!

సూపర్ స్టార్ మహేష్ వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో వస్తున్న సినిమాకు మహర్షి అని టైటిల్ పెట్టిన విషయం తెలిసిందే. దిల్ రాజు, అశ్వనిదత్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమలో మహేష్ సరసన పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తుంది. అల్లరి నరేష్ కూడా సినిమాలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాడని తెలుస్తుంది. ఈ సినిమా అమెరికా షెడ్యూల్ పూర్తి కాగానే విలేజ్ లో షూటింగ్ జరుపుకుంటుందట. 

ఈ విలేజ్ సెట్ రామోజి ఫిల్మ్ సిటీలో నిర్మిస్తున్నారని సమాచారం. మహేష్ 25వ సినిమాగా వస్తున్న ఈ సినిమా మీద భారీ అంచనాలున్నాయి. అమెరికా నుండి విలేజ్ కు షిఫ్ట్ అవుతుందా.. లేక ముందు విలేజ్ లోనే ఓపెన్ చేసి అమెరికాకు సినిమా షిఫ్ట్ అవుతుందో తెలియదు కాని ప్రస్తుతం 40 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా మహేష్ కెరియర్ లో ప్రత్యేకంగా నిలిచేలా తెరకెక్కిస్తున్నారట. 2019 ఏప్రిల్ 5న రిలీజ్ ప్లాన్ చేస్తున్న ఈ మూవీ ఎలాంటి హంగామా సృష్టిస్తుందో చూడాలి.