అరవింద సమేతలో అభయ్ రామ్..?

ఎన్.టి.ఆర్, త్రివిక్రం కాంబినేషన్ లో వస్తున్న అరవింద సమేత సినిమా దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సూర్యదేవర రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్దె, ఈషా రెబ్బ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. తమన్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాలోని సాంగ్స్ ఇప్పటికే సూపర్ హిట్ అయ్యాయి. 


ఇక ఈ సినిమాకు సంబందించిన ట్రైలర్ ఇప్పటికే సెన్సేషన్స్ క్రియేట్ చేస్తుంటే ఇక రీసెంట్ గా రిలీజ్ చేసిన ఈ సినిమా మేకింగ్ వీడియో నందమూరి ఫ్యాన్స్ ను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఆ వీడియోలో త్రివిక్రం, ఎన్.టి.ఆర్, పూజా హెగ్దెల అల్లరితో పాటుగా ఒక ఫ్రేమ్ లో కత్తి పట్టిన అభయ్ రాం కూడా కనిపించాడు. 

అది చూసిన నాటి నుండి అరవింద సమేతలో అభయ్ రామ్ కూడా ఉన్నాడని ఫ్యాన్స్ అంటున్నారు. అంతేకాదు ఎన్.టి.ఆర్ వీర రాఘవ రెండు పాత్రల్లో కనిపిస్తాడని తెలుస్తుంది. మరి వీటిల్లో నిజం ఏమాత్రం ఉంది అన్నది సినిమా చూస్తేనే కాని తెలుస్తుంది.