
స్టార్ సినిమా అంటే మొదట వారం ఎలా ఉన్నా నడిచేస్తుంది. అయితే పెద్ద హీరోల సినిమాలకు కోట్లకు కోట్లు పెట్టి కొనుక్కునే డిస్ట్రిబ్యూటర్స్ మొదటి వారం లోనే అవి ఎక్కువ మొత్తంలో రాబట్టేయాలని చూస్తారు. వీటిలో భాగంగా కొత్తగా టికెట్ రేటు వ్యవహారం మొదలు పెట్టారు. వారం పాటు పర్మిషన్ తెచ్చుకోవడం.. ఐదాటలేయడం ఇలాంటివి అన్నమాట.
దసరా బరిలో దిగుతున్న ఎన్.టి.ఆర్ అరవింద సమేతకు ఈ టికెట్ ప్రైజ్ పెంచబోతున్నారట. త్రివిక్రం, ఎన్.టి.ఆర్ కాంబినేషన్ లో వస్తున్న మొదటి సినిమాగా అరవింద సమేత మీద భారీ అంచనాలున్నాయి. అందుకే ఈ సినిమా ఆంధ్రాలో 200, నైజాం లో 120 టికెట్ రేటు చేసేలా రంగం సిద్ధం చేస్తున్నారట. ఆంధ్రాలో 200 చేయాలంటే అక్కడ సిఎం పర్మిషన్ తీసుకుంటారు. కాని తెలంగాణా రాష్ట్రంలో ఎలా అనే డౌట్ వస్తుంది. అరవింద సమేత నైజాం ఏరియా దిల్ రాజు సొంతం చేసుకున్నాడు. మరి కోర్టు నుండి ఆర్డర్ తెచ్చుకుంటాడా మరి ఏ దారిలో వెళ్లి టికెట్ ప్రైజ్ హైక్ చేసుకుంటాడాలో చూడాలి.