
యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ త్రివిక్రం కాంబినేషన్ లో వస్తున్న అరవింద సమేత సినిమా దసరా కానుకగా అక్టోబర్ 11న రిలీజ్ కాబోతుంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో సూర్యదేవర రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్దె, ఈషా రెబ్బ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. తమన్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా అదరగొడుతుంది.
ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 93 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. నైజాం, కృష్ణాలలో ఓన్ గా రిలీజ్ చేస్తుండగా మిగతా ఏరియాల్లో ఈ సినిమా అదిరిపోయే బిజినెస్ చేసింది. ఎన్.టి.ఆర్ కెరియర్ లో ఈ సినిమా హయ్యెస్ట్ బిజినెస్ చేసింది. ట్రైలర్ చూస్తే ఈ సినిమా సంచలనాలు సృష్టించడం ఖాయమని అంటున్నారు.