రెండు పార్టులుగా ఎన్.టి.ఆర్..!

ఎన్.టి.ఆర్ బయోపిక్ నుండి ఒ స్పెషల్ అప్డేట్ ఫ్యాన్స్ ను సర్ ప్రైజ్ చేస్తుంది. క్రిష్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో ఎన్.టి.ఆర్ గా బాలకృష్ణ తన విశ్వరూపం చూపించనున్నారు. ఎన్.బి.కే ప్రొడక్షన్స్ లో నిర్మితమవుతున్న ఎన్.టి.ఆర్ బయోపిక్ ఒక పార్టుగా లేకుండా రెండు పార్టులుగా రిలీజ్ చేయబోతున్నారని తెలుస్తుంది. మొదటి పార్టుకి టైటిల్ గా ఎన్.టి.ఆర్ కథానాయకుడు అని పెట్టారని తెలుస్తుంది.

ఎన్.టి.ఆర్ బాల్యం, సినిమా రంగ ప్రవేశం లాంటి విషయాలను మొదటి పార్టులో ప్రస్థావిస్తారట. ప్రతి కథకు ఓ నాయకుడుంటాడు.. కాని కథగా మారే నాయకుడు ఒక్కడే ఉంటాడు. అంటూ ఓ డైలాగ్ తో పోస్టర్ రిలీజ్ చేశారు. పోస్టర్ లో ఎన్.టి.ఆర్ యువకుడిగా బాలయ్య అదిరిపోయాడు. మొత్తానికి బాహుబలి ఫార్ములాతో ఒక కథను రెండు ముక్కలుగా చెప్పబోతున్నారన్నమాట.  

2019 జనవరి 9న ఎన్.టి.ఆర్ కథానాయకుడు సినిమా రిలీజ్ అవుతుంది. అయితే రెండో పార్టులో మాత్రం ఎన్.టి.ఆర్ రాజకీయ ప్రస్థానం గురించి.. పార్టీ ఆవిర్భావం లాంటి విషయాలు ఉంటాయట. మొత్తానికి ఎన్.టి.ఆర్ బయోపిక్ ఈ సర్ ప్రైజ్ నందమూరి ఫ్యాన్స్ ను ఉత్సాహపరుస్తుంది.