
మాటల మాంత్రికుడు త్రివిక్రం యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ కాంబినేషన్ లో వస్తున్న అరవింద సమేత సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. 12 ఏళ్లుగా ఈ కాంబినేషన్ కోసం ఎదురుచూస్తున్నా అని చెప్పాడు ఎన్.టి.ఆర్. నిన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ కాంబో నుండి ఎలాంటి సినిమా ఆశిస్తారో అందుకు తగినట్టుగానే ట్రైలర్ ఉందనిపిస్తుంది.
అరవింద సమేత ట్రైలర్ చూసిన త్రివిక్ర ఫ్యాన్స్ ఇన్నాళ్లు మాటల మాంత్రికుడు కేవలం మాటల తూటాలనే పేల్చేవాడనుకుంటే సడెన్ గా ఈ వాయిలెన్స్ మొదలు పెట్టాడేంటని ఆశ్చర్యపోతున్నారు. త్రివిక్రం లో దాగి ఉన్న బోయపాటి స్టైల్ ఎన్.టి.ఆర్ కోసం బయటకు వచ్చిందని తెలుస్తుంది. అక్టోబర్ 11న రిలీజ్ కాబోతున్న అరవింద సమేత సినిమా దసరా కానుకగా ప్రేక్షకులకు ముందే పండుగ తెచ్చేలా ఉంది.