
బిగ్ బాస్-2 విన్నర్ గా కౌశల్ సూపర్ ఫాలోయింగ్ ఏర్పరచుకున్నాడు. హౌజ్ లో తన యాటిట్యూడ్ నచ్చి బయట అతని కోసం ఓ ఆర్మీ సిద్ధమైంది. బిగ్ బాస్ నుండి బయటకు వచ్చాక కౌశల్ తన ఆర్మీతో కలిసి సెలబ్రేషన్స్ జరుపుకున్న విషయ తెలిసిందే. అయితే ఆ సెలబ్రేషన్స్ లో కౌశల్ మహేష్ ప్రస్థావన తెచ్చాడు. రాజకుమారుడు సినిమా టైంలో మహేష్ తనకు చాలా సపోర్ట్ గా నిలిచారని చెప్పాడు.
తన గురించి మాట్లాడిన కౌశల్ పై తన స్పందన తెలియచేశాడు మహేష్. కంగ్రాట్స్ కౌశల్ ఇది గొప్ప విజయం. చాలా సంతోషంగా ఉంది నీ విజయాన్ని చూసి. ఎంజాయ్ యువర్ సక్సెస్ అని ట్వీట్ చేశాడు మహేష్. మహేష్ ట్వీట్ తో కౌశల్ మరింత ఉత్సాహంగా ఉన్నాడని చెప్పొచ్చు. మొత్తానికి బిగ్ బాస్ 2 టైటిల్ గెలవడమే కాకుండా సూపర్ స్టార్ నుండి స్పెషల్ ట్వీట్ వచ్చేలా చేసుకున్న కౌశల్ రానున్న రోజుల్లో హీరోగా తన సత్తా చూపించేస్తాడని అనిపిస్తుంది.