
ఝాన్సి లక్ష్మి భాయి జీవీత కథతో కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా మణికర్ణిక. భారీ విజువ్ల్ ఎఫెక్ట్స్ తో పిరియాడికల్ మూవీగా రాబోతున్న ఈ సినిమాను క్రిష్ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాకు సంబందించిన టీజర్ రిలీజ్ చేశారు. టీజర్ సినిమా అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా వచ్చింది. బిడ్డకు తల్లైన ఝాన్సి లఖ్మి భాయ్ ఎలా యుద్ధ రంగంలోకి దిగిందన్న కాన్సెప్ట్ తో ఈ సినిమా వస్తుంది.
సినిమా దాదాపు పూర్తి కావొచ్చిందని తెలుస్తుండగా. సినిమా నుండి దర్శకుడు క్రిష్ బయటకు వచ్చాడు. కంగనాతో గొడవల వల్ల క్రిష్ బయటకు వచ్చాడని తెలుస్తుంది. అయితే గొడవలు ఉన్నా సరే దర్శకుడిగా రాధాకృష్ణ జాగర్లమూడి అనే వేశారు. జీ స్టూడియోస్, ఖైతాన్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాపై టీజర్ మరింత అంచనాలను పెంచింది. ముఖ్యంగా లక్ష్మి భాయిగా కంగనా ఎంత హార్డ్ వర్క్ చేసిందో టీజర్ చూస్తేనే తెలుస్తుంది. 2019 రిపబిక్ డే సందర్భంగా మణికర్ణిక రిలీజ్ చేయబోతున్నారు.