కౌశల్ విన్నరే.. కాని గీతాకే ఎక్కువ..!

బిగ్ బాస్ సీజన్ 2 విన్నర్ గా కౌశల్ తన స్టామినా ప్రూవ్ చేసుకున్నాడు. మొదటి నుండి ఆట మీద తన ఫోకస్ పెట్టిన కౌశల్ ఫైనల్ గా టైటిల్ విన్నర్ అయ్యాడు. ఇక ఈ సీజన్ లో కౌశల్ కు మొదటి నుండి టఫ్ ఫైట్ ఇస్తున్న గీతా మాధురి రన్నరప్ గా నిలిచింది. హౌజ్ లో అందరికన్నా ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్న కంటెస్టంట్ గా గీతా మాధురి పేరు వినిపించింది. అయితే ఆమె ఫైనల్ కు చేరితే ఆ లెక్క వేరే అని తెలుస్తుంది. 

దాదాపుగా టైటిల్ విన్ అయిన కౌశల్ ప్రైజ్ మనీ కన్నా గీతా మాధురి రెమ్యునరేషన్ గా ఎక్కువ మొత్తం అందుకున్నారని తెలుస్తుంది. ఇక కౌశల్ కూడా తనకు వచ్చిన 50 లక్షల మొత్తాన్ని తన తల్లి క్యాన్సర్ తో మరణించడం వల్ల అలా క్యాన్సర్ బారిన పడిన తల్లుల కోసం ఖర్చు పెడతానని అన్నాడు. ఓ రకంగా ఫైనల్ విన్నర్ కౌశల్.. రన్నరప్ గీతా మాధురి ఇద్దరు బిగ్ బాస్ 2ని సక్సెస్ చేయడంలో తమ వంతు బాధ్యత పూర్తి స్థాయిలో నిర్వర్తించారు.