
బిగ్ బాస్ 2 నిన్ననే కదా అయ్యింది అప్పుడే బిగ్ బాస్ 3 ఏంటని అవ్వాక్కవ్వొచ్చు. సీజన్ 2 పూర్తి కాగా తర్వాత సీజన్ కు ఏమాత్రం లేటు చేయకుండా మొదలు పెట్టే పనిలో ఉన్నారట స్టార్ మా నిర్వాహకులు. బిగ్ బాస్ 1 కు యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హోస్ట్ గా చేశాడు. బిగ్ బాస్ 2కి నానిని తీసుకొచ్చారు. నాని హోస్ట్ గా ఎన్.టి.ఆర్ కన్నా మెరుగ్గా అనిపించకపోయినా ఎలాగోలా సీజన్ సక్సెస్ ఫుల్ చేశాడు.
ఇక బిగ్ బాస్ 3 గురించి లేటెస్ట్ న్యూస్ ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతుందు. దీనికి హోస్ట్ గా మళ్లీ ఎన్.టి.ఆర్ నే సెలెక్ట్ చేసినట్టు తెలుస్తుంది. నాని హోస్టింగ్ బాగున్నప్పటికి కంటెస్టంట్స్ మీద కమాండింగ్ చూపించడంలో విఫలమయ్యాడు. అంతేకాదు ఒక కంటెస్టంట్స్ అభిమానులు నానిని టార్గెట్ చేసేలా అతని హోస్టింగ్ ఉంది. అయితే అది నాని తప్పు కాదులేండి.
సో మొత్తానికి బిగ్ బాస్ 3 తారక్ హోస్టింగ్ లో త్వరలోనే రాబోతుందట. మరి దీనిలో పాల్గొనే ఆ ఇంటి సభ్యులు ఎవరో చూడాలి. 3వ సీజన్ మరింత మజా ఇచ్చేలా కొత్త కాన్సెప్ట్స్ ప్లాన్ చేస్తున్నారట.