కొత్త కాన్సెప్ట్ తో సవ్యసాచి.. టీజర్ ఇంప్రెసివ్..!

అక్కినేని నాగ చైతన్య, చందు మొండేటి డైరక్షన్ లో వస్తున్న సినిమా సవ్యసాచి. ప్రేమం సినిమా రీమేక్ తర్వాత చందు మొండేటి నాగ చైతన్యతో కలిసి చేస్తున్న సినిమా ఇది. కార్తికేయ సినిమాతోనే తనలోని ప్రతిభ చాటుకున్న దర్శకుడు చందు మొండేటి డిఫరెంట్ కాన్సెప్ట్ తో చేస్తున్న సినిమా సవ్యసాచి. ఈ సినిమాకు సంబందించిన టీజర్ కొద్ది గంటల క్రితం రిలీజ్ అయ్యింది. 

ఈ సినిమా టీజర్ చూస్తే తప్పకుండా చైతు కెరియర్ లో ఇది ప్రత్యేకమైన సినిమా అవుతుందని అనిపిస్తుంది. కాన్సెప్ట్ తో పాటుగా కమర్షియల్ హంగులతో ఈ సినిమా తెరకెక్కించారని టీజర్ చూస్తేనే తెలుస్తుంది. మాస్ హీరోగా ఇమేజ్ తెచ్చుకోవాలని చూస్తున్న చైతుకి సవ్యసాచి వాటిని నిజం చేసేలా కనిపిస్తుంది. మరి సవ్యసాచి చైతు ఆశించిన సక్సెస్ అందిస్తుందో లేదో చూడాలంటే సినిమా వచ్చే దాకా వెయిట్ చేయాల్సిందే. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో విలన్ గా కోలీవుడ్ హీరో మాధవన్ నటిస్తున్నాడు. భూమిక కూడా ప్రత్యేక పాత్రలో అలరించనున్నారు.