బొమ్మరిల్లు దర్శకుడితో వెంకటేష్..?

ఒకప్పడు యూత్ అందరిని అలరించిన సినిమా బొమ్మరిల్లు. ఆ సినిమాతో ప్రతిభ చూపిన దర్శకుడు భాస్కర్ కు ఇంటి పేరుగా మారి అతన్ని బొమ్మరిల్లు భాస్కర్ అనేలా చేసింది. ఆ సినిమాతో సత్తా చాటిన అతను ఆ తర్వాత అల్లు అర్జున్ తో పరుగు పర్వాలేదు అనిపించుకున్నాడు. తెలుగు, తమిళ భాషల్లో రెండు మూడు ప్రయత్నాలు చేసినా ఫలితాలు నిరాశ పరచడంతో వెనుకపడ్డాడు. 

ఇప్పుడు మళ్లీ భాస్కర్ దర్శకుడిగా వెంకటేష్ తో సినిమా చేస్తున్నాడని తెలుస్తుంది. ఈమధ్యనే విక్టరీ వెంకటేష్ తో స్టోరీ డిస్కషన్స్ పూర్తి చేశాడట భాస్కర్. లైన్ నచ్చిన వెంకటేష్ సినిమాకు దాదాపు ఓకే అన్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం వెంకటేష్ కూడా ఎఫ్-2, వెంకీ మామ సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈ రెండు సినిమాలు పూర్తి చేశాక బొమ్మరిల్లు భాస్కర్ తో సినిమా ఉంటుందని తెలుస్తుంది. ఇదే కాకుండా వెంకటేష్ తో సినిమా తీసేందుకు త్రివిక్రం కూడా రెడీ అంటున్నట్టు ఫిల్మ్ నగర్ టాక్. మరి వెంకటేష్ తో ముందు భాస్కర్, త్రివిక్రంలలో ఎవరు ముందు చేస్తారో తెలియాల్సి ఉంది.