
బోయపాటితో బాలకృష్ణ చేసిన రెండు సినిమాలు సింహా, లెజెండ్ రెండూ సూపర్ హిట్ కొట్టాయి. కెరియర్ కాస్త అటు ఇటుగా ఉన్న టైంలో బాలకృష్ణ ఇమేజ్ డబుల్ చేసేలా సింహా సినిమా సూపర్ హిట్ అందుకుంది. ఆ తర్వాత మళ్లీ తన సత్తా చాటుతూ వచ్చాడు బాలయ్య. ఇక లెజెండ్ కూడా వీరి కాంబినేషన్ లో వచ్చి విజయం సాధించింది. ఇక ముచ్చటగా మూడవసారి ఈ కాంబోలో సినిమా రాబోతుంది.
హ్యాట్రిక్ హిట్ కొట్టేందుకు ఈసారి భారీ బడ్జెట్ తో భారీ సినిమానే ప్లాన్ చేశారు బాలకృష్ణ, బోయపాటి. ప్రస్తుతం బోయపాటి చరణ్ తో సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా పూర్తి కాగానే బాలకృష్ణతో సినిమా చేస్తాడట. ఎన్.టి.ఆర్ బయోపిక్ తో బిజీగా ఉన్న బాలకృష్ణ బోయపాటితో సినిమాకు 70 రోజులు కేటాయించాడట. ఆ 70 రోజుల సినిమాకు 70 కోట్ల బడ్జెట్ పెడుతున్నారట. బాలకృష్ణ కెరియర్ లో హయ్యెస్ట్ బడ్జెట్ తో వస్తున్న ఈ మూవీ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.