చరణ్ 'స్టేట్ రౌడీ'..!

మెగా పవర్ స్టార్ రాం చరణ్ హీరోగా బోయపాటి శ్రీను డైరక్షన్ లో ఓ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో భరత్ అనే నేను హీరోయిన్స్ కియరా అద్వాని హీరోయిన్ గా నటిస్తుంది. బాలీవ్డ్ హీరో వివేక్ ఓబేరాయ్ ఈ సినిమాలో విలన్ గా నటిస్తుండగా. ఆర్యన్ రాజేష్, కోలీవుడ్ హీరో ప్రశాంత్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు.   

తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమా టైటిల్ గా స్టేట్ రౌడీ అని పెట్టబోతున్నారట. ఆ టైటిల్ వినగానే 19819 లో చిరంజీవి నటించిన సినిమా గుర్తుకు రాక మానదు. బి.గోపాల్ డైరక్షన్ లో వచ్చిన ఆ సినిమా చిరుకి మంచి హిట్ ఇచ్చింది. ఇక రాబోతున్న చరణ్ సినిమాకు ఈ టైటిల్ పెట్టి సినిమాపై మరింత అంచనాలు పెంచారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ ను అక్టోబర్ 19న దసరా రోజున రివీల్ చేస్తారని తెలుస్తుంది.