అక్కడ మహర్షి రేటు అదిరింది

సూపర్ స్టార్ మహేష్ వంశీ పైడిపల్లి డైరక్షన్ లో వస్తున్న సినిమా మహర్షి. దిల్ రాజు, అశ్వనిదత్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తుంది. 2019 ఏప్రిల్ 5న రిలీజ్ ప్లాన్ చేస్తున్న ఈ సినిమా హిందిలో కూడా భారీ రేటు పలికిందని తెలుస్తుంది. మహర్షి సినిమా హింది డబ్బింగ్ రైట్స్ పాతిక కోట్లకు డీల్ సెట్ చేసుకున్నారట. ఈమధ్య తెలుగు సినిమాలకు బాలీవుడ్ లో బీభత్సమైన క్రేజ్ ఏర్పడింది.  

చరణ్, బోయపాటి సినిమా కూడా హింది రైట్స్ గా 22 కోట్లు పలికిందట. ఆ రికార్డ్ బ్రేక్ చేస్తూ మహేష్ మహర్షి ఏకంగా 25 కోట్లకు అమ్ముడయ్యిందని తెలుస్తుంది. తెలుగు డబ్బింగ్ సినిమాలు హిందిలో బాక్సాఫీస్ దగ్గర మాత్రమే కాదు యూట్యూబ్ లో కూడా సెన్సేషన్స్ క్రియేట్ చేస్తున్నాయి. అందుకే అంత రేటు పెట్టి మరి కొనేస్తున్నారు. మహేష్ 25వ సినిమాగా రాబోతున్న మహర్షి ఎలాంటి సత్తా చాటుతుందో చూడాలి.