
పెళ్లి తర్వాత కమర్షియల్ సినిమాలకు దాదాపు ఫుల్ స్టాప్ పెట్టేసిన సమంత యూటర్న్ సినిమాతో తనలోని డిఫరెంట్ టాలెంట్ చాటుకుంది. సమంత కెరియర్ లో ఎప్పుడు చేయని పాత్రలో యూటర్న్ సినిమాలో కనిపించి అలరించింది. సినిమా ఫలితం కూడా పాజిటివ్ గానే రావడంతో ఇక సమంతతో ప్రయోగాలకు సిద్ధమవుతున్నారు దర్శక నిర్మాతలు. ఈ క్రమంలో భాగంగా సమంత కొరియన్ మూవీ మిస్ గ్రానీ రీమేక్ లో నటిస్తుందని అంటున్నారు.
సురేష్ బాబు నిర్మాణంలో ఈ సినిమా రాబోతుందట. నందిని రెడ్డి డైరక్షన్ లో రాబోతున్న ఈ సినిమాకు సంబందించిన అఫిషియల్ న్యూస్ బయటకు రావాల్సి ఉంది. సమంత మిస్ గ్రానీగా ఎలా ఉండబోతుందో అని ఆమె ఫ్యాన్స్ లో ఎక్సైట్మెంట్ మొదలైంది. ఈ సినిమాలో సమంత 60 ఏళ్ల బామ్మగా పాతికేళ్ల పడుచు అమ్మాయిగా కనిపించనుందట.