
మాస్ మహరాజ్ రవితేజ, శ్రీను వైట్ల కాంబినేషన్ లో వస్తున్న సినిమా అమర్ అక్బర్ ఆంటోనీ. దసరా బరిలో దిగాలని చూస్తున్న ఈ సినిమా నుండి పివోట్ ఒకటి రిలీజ్ చేశారు. దర్శకుడు శ్రీను వైట్ల పుట్టినరోజు కానుకగా వచ్చిన ఈ పివోట్ లో అమర్, అక్బర్, ఆంటోనీ ముగ్గురు సీరియస్ గా దేని గురించో ఆలోచిస్తున్నట్టు గా కనిపించారు. రవితేజ ట్రిపుల్ రోల్ చేస్తున్న ఈ సినిమా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో వస్తుంది.
ఈ పివోట్ సినిమాపై ఆసక్తి పెంచేలా ఉండగా సినిమా ద్వారా చాలా గ్యాప్ తర్వాత తెలుగులో నటిస్తుంది ఇలియానా. రాజా ది గ్రేట్ హిట్ తర్వాత టచ్ చేసి చూడు, నేల టిక్కెట్టు సినిమాలతో ఫ్లాప్ అందుకున్న రవితేజ ఈ సినిమాతో హిట్ కొట్టాలని చూస్తున్నాడు. ఆగడు, మిస్టర్ ఫ్లాపుల తర్వాత శ్రీను వైట్ల టాలెంట్ చూపించేలా వస్తున్న ఈ ట్రిపుల్ 'A' ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.