హైదరాబాద్ వాసులకు మెట్రో స్పెషల్ సర్వీసస్

ఈరోజు క్రిస్మస్ పండుగ సందర్భంగా హైదరాబాద్ జంటనగరాలలో ప్రజల సౌకర్యార్ధం మెట్రో రైల్ సర్వీసులను రాత్రి ఒంటి గంటవరకు నడిపించబోతున్నట్లు హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ ప్రకటించింది. మళ్ళీ ఈ నెల 31వ తేదీన నగరంలో పలుప్రాంతాల్లో జరిగే నూతన సంవత్సర వేడుకలలో పాల్గొనేందుకు వీలుగా ఆరోజు రాత్రి 2 గంటల వరకు మెట్రో రైల్ సర్వీసు లను నడిపించబోతున్నట్లు హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ ప్రకటించింది. కనుక ఈ రెండు రోజులలో ప్రజలు నిశ్చింతగా క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకలలో పాల్గొని తిరిగి ఇళ్ళకు చేరుకోవచ్చు.