జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ మురళికి ఎంపిడివోలకు మద్య గత కొంత కాలంగా జరుగుతున్న ప్రచ్చన్నయుద్ధం నేడు తారాస్థాయికి చేరింది. కలెక్టర్ మురళి మొన్నఎంపిడివోలతో వీడియో కాన్ఫరెన్సింగ్ నిర్వహించినప్పుడు వారి పనితీరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ గట్టిగా మందలించారు. దాంతో మనస్తాపం చెందిన ఎంపిడివోలు గురువారం నుంచి నిరవధికంగా సామూహిక శలవులపై వెళుతున్నట్లు ప్రకటించి తమ నిరసన తెలియజేశారు. ఈరోజు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించిన తరువాత, కలెక్టర్ నుంచి వచ్చే స్పందనను బట్టి తమ తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని ఎంపిడివోల ప్రతినిధులు చెప్పారు. కలెక్టర్ మురళి చిన్నాపెద్దా చూడకుండా నోటికివచ్చినట్లు చాలా దురుసుగా మాట్లాడుతుంటారని వారు ఆరోపిస్తున్నారు. కనుక వారిమధ్య జరుగుతున్న ఈ యుద్ధం తరువాత ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.