మాదకద్రవ్యాల కేసులో మళ్ళీ కదలిక

తెలుగు సినీ ప్రముఖుల మాదకద్రవ్యాల కేసుకు సంబంధించిన ఫోరెన్సిక్ నివేదిక రెండు రోజుల క్రితమే న్యాయస్థానానికి చేరుకొంది. ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ అకున్ సభర్వాల్ నేతృత్వంలో ఈ కేసులను విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఆ నివేదిక ఆధారంగా త్వరలో న్యాయస్థానంలో ఛార్జ్-షీట్ ఫైల్ చేయడానికి సిద్దం అవుతోంది. మాదకద్రవ్యాల కేసులో విచారణకు హాజరైన 12 మంది సినీ ప్రముఖులలో ముగ్గురు మాత్రమే తమ గోళ్ళు, రక్తం, జుట్టు నమూనాలను దర్యాప్తు బృందానికి ఇచ్చారు. కనుక వారి ముగ్గురు నుంచి సేకరించిన నమూనాలనే ఫోరెన్సిక్ సంస్థకు పంపించగా, వాటిలో ఒకరి నమూనాలలో మాదకద్రవ్యాల అవశేషాలు కనుగొన్నట్లు సమాచారం. ఈ కేసులపై త్వరలోనే ఎలాగూ కోర్టులో సిట్ ఛార్జ్-షీట్ వేయబోతోంది కనుక ఈ కేసుపై అప్పుడు స్పష్టత రావచ్చు.